ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్ | Hamsa Nandini Item Song in Ntr Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్

Mar 25 2017 10:28 AM | Updated on Sep 5 2017 7:04 AM

ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్

ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్

జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ

జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడిస్తున్నారు.

తన ఐటమ్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అన్న రేంజ్లో పేరు తెచ్చుకున్న హంసానందిని ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు సినిమాలో కీలకమైన పలు సన్నివేశాల్లోనూ హంస కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న జై లవకుశ సినిమాతో ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement