సిస్టరాఫ్‌ జీవీ | GV Prakash's sister debut as actress in vijay sethupathi's movie | Sakshi
Sakshi News home page

సిస్టరాఫ్‌ జీవీ

Jun 15 2019 12:49 AM | Updated on Jun 15 2019 12:49 AM

GV Prakash's sister debut as actress in vijay sethupathi's movie - Sakshi

జీవీ భవాని

తమిళంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా మారిన వారిలో జీవీ ప్రకాశ్‌ ఒకరు. తమిళ సినిమాలో ప్రస్తుతం మినిమమ్‌ గ్యారెంటీ హీరోల లిస్ట్‌లో జీవీ ఉన్నారు. చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండేట్టు వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్‌ సోదరి జీవీ భవాని శ్రీ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్‌ సేతుపతి – విరుమాండి దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న సినిమాలో కీలక పాత్రలో భవాని శ్రీ కనిపిస్తారట. ఈ సినిమా ఇటీవలే  ప్రారంభం అయింది. ఇటీవల అమల చేసిన ‘హై ప్రీస్టెస్‌’ వెబ్‌ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించారామె.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement