‘నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి’ | GV Prakash Says He Is Scared Of AR Rahman In Facebook Live Chat | Sakshi
Sakshi News home page

‘రెహమాన్‌ సర్‌ అంటే చాలా భయం’

Dec 3 2018 12:13 PM | Updated on Dec 3 2018 8:14 PM

GV Prakash Says He Is Scared Of AR Rahman In Facebook Live Chat - Sakshi

జీవీ ప్రకాశ్‌తో ఏఆర్‌ రెహమాన్‌

‘నిజంగా నాకు రెహమాన్‌ అంటే చాలా భయం.

సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌. ‘డార్లింగ్‌’  సినిమాతో హిట్‌ కొట్టిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కాగా జీవీ నటించిన తాజా చిత్రం ‘సర్వం తాళమయం’. రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మ్యూజికల్‌ డ్రామాకు రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జీవీ, రాజీవ్‌ మీనన్‌, రెహమాన్‌ ఫేస్‌బుక్‌లో లైవ్‌చాట్‌ నిర్వహించారు.

వీరి సరదా సంభాషణలో భాగంగా.. ‘నిజంగా నాకు రెహమాన్‌ అంటే చాలా భయం. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వచ్చేది’ అంటూ జీవీ చెప్పుకొచ్చాడు. మేనల్లుడి వ్యాఖ్యలకు స్పందించిన రెహమాన్‌.. ‘ నేను నీపై అరిచింది కేవలం ఒకే ఒక్కసారి. కానీ నువ్ మాత్రం అంతలా భయపడ్డావా. ఇదంతా నటనే కదా జీవీ. మంచి నటుడివి అని నిరూపించుకున్నావులే’ అంటూ చమత్కరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement