ప్రేమను వెతుక్కుంటూ నిత్యానంద | GV Prakash Kumar draws lightning in first look poster of 'Kadhalai Thedi Nithya Nandha' | Sakshi
Sakshi News home page

ప్రేమను వెతుక్కుంటూ నిత్యానంద

Sep 16 2018 2:27 AM | Updated on Apr 8 2019 7:50 PM

GV Prakash Kumar draws lightning in first look poster of 'Kadhalai Thedi Nithya Nandha' - Sakshi

జీవీ ప్రకాశ్‌

సినిమా మీద ఇంట్రెస్ట్‌ తెప్పించడానికి, ఆడియన్స్‌ను థియేటర్‌ వరకూ రప్పించడానికి కొన్నిసార్లు సినిమా టైటిల్‌ చాలు. ఆ ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నట్టున్నారు తమిళ దర్శకుడు ఆదిక్‌. ఆల్రెడీ తన గత సినిమాలకు ‘త్రిష ఇల్లన నయనతార (తెలుగులో ‘త్రిషా లేదా నయనతార’) అఅఅ (అన్బానవన్‌ అసరదావన్‌ అడంగాదవన్‌) అని పెట్టారు.

ప్రస్తుతం సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ హీరోగా చేస్తోన్న సినిమాకు ఆయన పెట్టిన టైటిల్‌ ‘కాదలై తేడి నిత్యానంద’ (అంటే ప్రేమను వెతుకుతూ నిత్యానంద). ఈ పాటికే మీకు అర్థం అయ్యింటుంది ఎంత క్రేజీ టైటిల్‌ని తన సినిమాకు పెట్టారో. పోస్టర్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది కదూ. సోనియా అగర్వాల్, అమైరా దస్తూర్, సంచితా శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రేమను వెతుక్కునే అమర ప్రేమికుడిగా జీవీ ప్రకాశ్‌ కనిపిస్తారని ఊహించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement