మనోజ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌ | Gunturodu Movie Trailer Released | Sakshi
Sakshi News home page

మనోజ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌

Jan 12 2017 12:11 AM | Updated on Aug 24 2018 2:36 PM

మనోజ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌ - Sakshi

మనోజ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌

మంచు మనోజ్‌ హీరోగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్‌ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని మోహన్‌బాబు విడుదల చేశారు.

మంచు మనోజ్‌ హీరోగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్‌ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని మోహన్‌బాబు విడుదల చేశారు. ‘‘ట్రైలర్‌లో ప్రతి ఫేమ్‌ అద్భుతంగా ఉంది. దర్శకుడు సత్య చక్కగా తెరకెక్కించారు. మనోజ్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నా’’ అని మోహన్‌బాబు చెప్పారు.

‘‘ఈ నెలాఖరున ఆడియో, ఫిబ్రవరి 10న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీ వరుణ్‌ అట్లూరి. ప్రజ్ఞా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ప్రభుతేజ, సంగీతం: శ్రీ వసంత్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement