ఆస్కార్‌ బరిలో ‘గల్లీబాయ్‌’

Gully Boy Is Indias Official Entry For The Oscars - Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన గల్లీ భాయ్‌ చిత్రం 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఫరాన్‌ అక్తర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది.

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో జోయా అక్తర్‌ తెరకెక్కించిన చిత్రం గల్లీ భాయ్‌. ఇందులో రణ్‌వీర్‌ మంచి సింగర్‌ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతను ముంబై మురికి వాడల్లో తిరిగే సామాన్య వ్యక్తి కావడంతో అందరూ తక్కువగా చూస్తుంటారు. అతన్ని హేళన చేస్తూ మాట్లాడుతారు. చదువుకొమ్మని కాలేజ్‌కి పంపిస్తే పాటలు అంటూ రోడ్లపై తిరుగుతున్నాడని రణ్‌వీర్‌ తండ్రి కూడా కోప్పడతాడు. చివరకూ ఆ యువకుడు ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top