హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు | Gul Panag's husband back from Brussels | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు

Mar 27 2016 5:33 PM | Updated on Apr 3 2019 6:23 PM

హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు - Sakshi

హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు

బాలీవుడ్ నటి గుల్ పనాగ్ భర్త, పైలెట్ జీఎస్ అట్టారీ సురక్షితంగా తిరిగొచ్చాడు. బ్రస్సెల్స్లో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆయన క్షేమంగా ఇంటికి చేరారు.

ముంబయి: బాలీవుడ్ నటి గుల్ పనాగ్ భర్త, పైలెట్ జీఎస్ అట్టారీ సురక్షితంగా తిరిగొచ్చాడు. బ్రస్సెల్స్లో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆయన క్షేమంగా ఇంటికి చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జీఎస్ అటారీ జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమాన పైలెట్గా పనిచేస్తున్నారు.

బ్రస్సెల్స్ లోని మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ఇండియాకు చెందిన రెండు విమానాలను అదే ఎయిర్ పోర్ట్లో దింపారు. ఆ తర్వాత బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఆయన అక్కడే స్ట్రక్ అయిపోయారు. దీంతో గుల్ పనాగ్ ఆమె స్నేహితులు తెగ ఆందోళన పడిపోయారు. దీంతో ఆయన సురక్షితంగా తిరిగొచ్చారంటూ ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement