పాపులర్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి... | Gujrat Man Morphed Famous Singer Photo | Sakshi
Sakshi News home page

ఫిమేల్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

Aug 24 2017 3:39 PM | Updated on Oct 8 2018 3:07 PM

పాపులర్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి... - Sakshi

పాపులర్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి...

పాపులర్‌ ఫిమేల్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్‌ చేసి మరీ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన...

అహ్మదాబాద్‌: పాపులర్‌ సింగర్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఓ వ్యక్తిని గుజరాత్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ఛార్‌ ఛార్‌ బంగడీవాలీ’’ సాంగ్‌ ఫేమ్‌ కింజాలీ దేవీ ఈ కేసులో బాధితురాలు కావటం విశేషం.
 
అమరైవాడికి చెందిన నీరజ్‌ మక్వానా అనే 30 ఏళ్ల వ్యక్తి గాయని కింజాలీ దవే ఫోటోను మార్ఫింగ్‌ చేసి తన భార్యేనంటూ ఫేస్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఈ విషయం గమనించిన సింగర్‌ తండ్రి స్నేహితుడొకరు ఆమెకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన కింజాలీ తండ్రి సైబర్‌ సెల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
‘మక్వానాను మేము అరెస్ట్ చేశాం. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ఆమెను అసలు ఎప్పుడూ కలవలేదని విచారణలో వెల్లడించిన మక్వానా,  మార్ఫింగ్ చేసినట్లు తెలిపాడు’ అని సైబర్‌ సెల్‌ అధికారులు తెలియజేశారు. అయితే ఆమె ఫోటోలనే ఎందుకు మార్ఫింగ్ చేశాడన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సైబర్‌ నేరగాళ్లు తరచూ ఇలా తమ ఫోటోలను మార్ఫింగ్ చేస్తుండటంతో పలువురు సెలబ్రిటీలు ఇబ్బంది పాలవుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement