టాలీవుడ్‌కి రెజ్లింగ్‌ స్టార్‌

The Great Khali all set to make his Tollywood debut  - Sakshi

ఇండియన్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్‌ ‘ది గ్రేట్‌ ఖలీ’ తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు ఈ ఏడడుగుల రెజ్లర్‌. ఇప్పటికే పలు హాలీవుడ్‌ సినిమాల్లో, అమెరికన్‌ టీవీ షోల్లో నటించిన ఖలీ ‘బిగ్‌బాస్‌ 4’లో కూడా కనిపించి అభిమానులను అలరించారు. స్పోర్ట్స్‌ డ్రామాగా జయంత్‌ తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో నీలేష్‌ ఎటి, ఇజబెల్లా  జంటగా నటిస్తున్నారు.

ఇండియా, పాకిస్థాన్‌ నేపథ్యంలో సినిమా రూపొందుతుండటంతో ఇస్లామిక్‌ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘నరేంద్ర’ చిత్రం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రామ్‌ సంపత్‌ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: ఇషాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కోయలగుండ్ల, కెమెరా: విరీన్‌ తంబిదొరై, సంగీతం: రామ్‌ సంపత్, కథ–దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top