అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా | Gopichand, Regina Cassandra's Soukyam movie | Sakshi
Sakshi News home page

అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా

Nov 20 2015 11:19 PM | Updated on Sep 3 2017 12:46 PM

అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా

అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో రెజీనా ముందు వరుసలో నిలుస్తారు. ‘ఎస్.ఎమ్.ఎస్’తో మొదలైన ఆమె సినీ ప్రయాణం

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో రెజీనా ముందు వరుసలో నిలుస్తారు. ‘ఎస్.ఎమ్.ఎస్’తో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటివరకూ ఎక్కడా బ్రేకుల్లేకుండానే సాగుతోంది. అయినా ఇంత వరకూ ఆమె ఊహించనంత మలుపు రాలేదు. అందుకే ఆమె ‘సౌఖ్యం’ సినిమా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే హీరోయిన్ల విషయంలో హీరో గోపీచంద్‌ది లక్కీహ్యాండ్ అనే చెప్పాలి. అతని సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు టాప్ స్లాట్‌లోకి దూసుకె ళ్లారు.

అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్. ‘లౌక్యం’లో గోపీచంద్‌తో రొమాన్స్ చేసిన రకుల్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. రకుల్‌కి ‘లౌక్యం’ లానే తనకు  ‘సౌఖ్యం’  టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశాభావంలో ఉన్నారు రెజీనా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ‘సౌఖ్యం’ చిత్రానికి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. డిసెంబరు 13న ఒంగోలులో భారీ ఎత్తున పాటల వేడుక చేయనున్నారు. క్రిస్‌మస్ కానుకగా డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement