జోరుగా... హుషారుగా! | gopichand new movie 'oxygen' motion poster release | Sakshi
Sakshi News home page

జోరుగా... హుషారుగా!

Jun 11 2016 10:58 PM | Updated on Sep 4 2017 2:15 AM

జోరుగా... హుషారుగా!

జోరుగా... హుషారుగా!

గోపీచంద్ మంచి మాస్ హీరో... పక్కా ఫ్యామిలీ హీరో కూడా. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యాక్షన్ మూవీస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.

గోపీచంద్ మంచి మాస్ హీరో... పక్కా ఫ్యామిలీ హీరో కూడా. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యాక్షన్ మూవీస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ‘లౌక్యం’ వంటి ఎంటర్‌టైనర్ తర్వాత ‘జిల్’ అంటూ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశారు. ఇప్పుడు ‘ఆక్సిజన్’ అనే వెరైటీ టైటిల్‌తో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ లుక్‌ని కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మరో లుక్‌నీ, మోషన్ పోస్టర్‌నీ విడుదల చేశారు. ఈ లుక్ చూస్తుంటే సినిమాలో గోపీచంద్ జోరుగా హుషారుగా డ్యాన్స్ చేశారనిపిస్తోంది కదూ. ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.

ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుల్ కథానాయికలు. దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ-  ‘‘ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ రాని డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యువన్  శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం. జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్: మిల్టన్.

Advertisement
 
Advertisement
Advertisement