గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..? | Gopichand movie title bullet or aradugula bullet | Sakshi
Sakshi News home page

గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?

Oct 27 2016 10:33 AM | Updated on Sep 4 2017 6:29 PM

గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?

గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?

మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనరేషన్ యాక్షన్ హీరో గోపీచంద్.

మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనరేషన్ యాక్షన్ హీరో గోపీచంద్. ఇటీవల స్టైలిష్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్న ఈ మ్యాన్లీ స్టార్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్తో పాటు, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బి గోపాల్ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో రమేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ టైటిల్ వేటలో బిజీగా ఉంది. ముందుగా బలం అనే టైటిల్ ఫిక్స్ చేసినా.. ప్రస్తుతం బుల్లెట్ లేదా ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే టైటిల్ను ఫైనల్ చేసి దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement