నేనొస్తున్నా | Gopichand Chanakya Movie Teaser Launched | Sakshi
Sakshi News home page

నేనొస్తున్నా

Sep 10 2019 6:15 AM | Updated on Sep 10 2019 6:15 AM

Gopichand Chanakya Movie Teaser Launched - Sakshi

‘‘సార్‌ మనం (గూఢచారులు) రెండు లైఫ్‌లు లీడ్‌ చేస్తుంటాం. ఒకటి అబద్ధం. రెండోది నిజం’. ‘నా పేరు అర్జున్, ఐయామ్‌ యాన్‌ ఇండియన్‌’. ‘నీ గుండెల్లో దమ్ముంటే అక్కడే ఆగు బే, నేను వస్తున్నా’’ అంటూ పవర్‌ఫుల్‌ స్పైగా ‘చాణక్య’ సినిమాలో డైలాగ్స్‌ చెబుతున్నారు గోపీచంద్‌. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీనా ఖాన్‌ హీరోయిన్లు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్‌ సోమవారం విడుదలయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు కెమెరా: వెట్రి, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

Advertisement
 
Advertisement
Advertisement