అక్టోబ‌ర్ 27న గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌' | Gopi Chand Oxygen Release Date | Sakshi
Sakshi News home page

అక్టోబ‌ర్ 27న గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'

Sep 22 2017 4:16 PM | Updated on Sep 22 2017 5:52 PM

అక్టోబ‌ర్ 27న గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'

అక్టోబ‌ర్ 27న గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబ‌ర్ 27న విడుద‌లకు సిద్ధమవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ..

'హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్ తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం గోపీచంద్‌ కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ అవుతుంది. హీరో డెడికేష‌న్‌, స‌పోర్ట్‌ కారణంగా సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాం.  ఫ‌స్ట్ కాపీ సిద్ధమైంది. సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజ‌న్ చిత్రాన్ని రూపొందించాం.

జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స అవుతుంది. సీజీ వ‌ర్క్స్ అద్భుతంగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేసి, సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement