ప్రియాంకకు బంగారు గాజులు తొడిగిన సుబ్బరామిరెడ్డి | gold bangles to priyanka chopra subbaramireddy | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు బంగారు గాజులు తొడిగిన సుబ్బరామిరెడ్డి

Apr 13 2016 5:26 PM | Updated on Sep 3 2017 9:51 PM

ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి సత్కరించారు. ఆయన వ్యక్తిగత ఫౌండేషన్ టీఎస్ఆర్ తరుపున ఆమెను సన్మానించారు.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి సత్కరించారు. ఆయన వ్యక్తిగత ఫౌండేషన్ టీఎస్ఆర్ తరుపున ఆమెను సన్మానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

సాంస్కృతికకళారంగాల్లో రాణించేవారిని గుర్తించడం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ ఆస్కిత్, శత్రఘ్న సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సత్కరించారు. ఎంపీ సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ప్రియాంక ప్రపంచ నటి అన్నారు. ఆమె నటనను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement