breaking news
Gold bangles
-
తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!
కన్నబిడ్డ సామర్థ్యం మీద ఒక తల్లి నమ్మకం ఆ కూతురు భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. కన్నతల్లి కష్టాన్ని , తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని కూతురు ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కష్టపడి చదివి, ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని సాధించిన ఒక బెంగళూరు యువతి కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింంది. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa)అసలు ఏమైంది?కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు, తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తల్లి ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తాకట్టు పెట్టింది. తన తల్లి త్యాగాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆ కుమార్తె అహర్నిశలూ కష్ట పడింది. తన సక్సెస్ స్టోరీని అనుస్మిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించడానికి తల్లి తన చేతికున్న బంగారు గాజులను తాకట్టు పెట్టారు. ఆ రోజు తల్లి చూపిన చొరవ, చేసిన త్యాగమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె పేర్కొన్నారు.ఏమాత్రం వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా చేసిన ఆమె త్యాగమే తన సక్సెస్‌కు మూలమని సంతోషాన్ని ప్రకటించింది.తల్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా, ఆ యువతి, చదువులో నిరంతరం శ్రమిస్తూ అద్భుతమైన ప్రతిభతో రాణించింది. కాలేజీ రోజుల్లోనే కోడింగ్, సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించింది. చివరకు దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్-1 గా ఉద్యోగాన్ని అమ్మకు గిఫ్ట్‌గా అందించింది."నా కాలేజీ అడ్మిషన్ ఫీజు కట్టడానికి అమ్మ తన బంగారు గాజులను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు, అమ్మ ఎప్పుడూ అలాగే చేస్తుంది," అని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్' (Flipkart)లో ఉద్యోగం రావడం అనేది కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు; తన తల్లి చేసిన త్యాగానికి నిదర్శనమి పేర్కొంది. ప్రతిరోజూ ఫ్లిప్‌కార్ట్‌కు వెళ్తున్నప్పుడు, అమ్మ కోసమే వెళ్తున్నానని భావిస్తాననని ఈ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అమ్మ చేసిన త్యాగానికి రుజువు అని చెప్పింది.తన జీవితంలోని ఈఅద్భుతమైన విషయాన్ని అందరికీ చెప్పడానికి ఈ రోజు సరైనదనిపించిందంటూ ‘‘అమ్మా... ఇది నీ కోసమే. అన్నీ నీ కోసమే. ఎప్పటికీ. అన్నింటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను." అంటూ అనుస్మిత ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. -
అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారపు గాజులను'..
ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లని, ప్రాణ స్నేహితుల్ని నమ్మడానికి వీల్లేని రోజులు. సాయం చేసిన వాడినే నాశనం చేసే దారుణమైన గడ్డు రోజుల్లో. 'మనిషన్న వాడు కానిరాడమ్మా..' అనే ఆర్యోక్తిలా ఉన్నాయి పరిస్థితులు. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో ఉదంతలే నిదర్శనం. కానీ దాన్నే తలదన్నేలా ఇక్కడ జరిగిన సంఘటన హైలెట్‌గా నిలిచింది. పైగా 'నమ్మకానికి' కొండంత విలవ ఉంది అని నిరూపించే అపురూపమైన ఘటన ఇది.మెట్రో ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిందే. జనంతో కిటకిటలాడుతూ..అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి బెంగళూరు మెట్రో ప్రయాణంలో జరిగిన ఘటన నెట్టింట అందరి మనసులను తాకింది. రోజువారి ప్రయాణంలో కనిపించిన దయకు సంబంధించిన ఓవిషయాన్ని నెట్టింట ఒక మహిళ పంచుకుంది. ఆ పోస్ట్‌లో ఆ మహిళ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడూ..ఒక చిన్న అమ్మాయి మణికట్టుపై అందమైన బంగారు గాజుని గమనించింది. అయితే ఆ గాజు డిజైన్ ఆమెను ఆకట్టుకుంది. వెంటనే ఆమె ఆ అమ్మాయిని కాస్త ఆ గాజుని ఫోటో తీసి ఇవ్వగలరా..నేను అదేలాంటి డిజైన్ గాజుని తయారుచేయించుకుంటానని అడిగింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. పైగా ఆ మహిళను విస్తుపోయాలే చేసింది ఆ అమ్మాయి. అప్రయత్నంగా తన చేతి గాజుని తీసి ఆ మహిళ చేతిలో పెట్టేసి మీకు నచ్చినట్లుగా చేయించుకోండి అని సింపుల్‌గా అంటుంది. ఆ హఠాత్పరిణామనికి ఆ మహిళ నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి.. ఇది ఒరిజనల్ బంగారు గాజు కాదని, ఇంది వన్ గ్రామ్ గోల్డ్ బంగారు గాజు అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె విశాల హృదయం, నిజాయితీ ఆమె మనసుని తాకడమే గాక ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకం ఇంకా బతికే ఉందా అని ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. అంతేగాదు ఆ అపురూపమైన క్షణానికి గుర్తుగా ఆ గాజుని తన వద్ద ఉంచుకుంది. పైగా అందుకు సంబంధించిన అపురూపమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ గాజు తన సొంతం ఎలా అయ్యిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.(చదవండి: పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..) -
కస్టమర్లా వచ్చి.. సిబ్బందితో మాట కలిపి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్లా వచ్చిన ఓ మహిళ బంగారు గాజును తస్కరించింది. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని తనిష్క్ జువెలర్స్‌లో ఈ నెల 9న గుర్తు తెలియని మహిళ వచ్చింది. తాను బంగారు గాజులు కొనాలనుకుంటున్నట్లు సిబ్బందికి చెప్పింది. దీంతో కొన్ని రకాల డిజైన్లను చూపించారు. వివిధ గాజులను పరిశీలించిన ఆ మహిళ తనకు మరికొన్ని డిజైన్లు చూపించాలని కోరింది. ఆయా గాజుల ధరలను అడుగుతూ సిబ్బందితో మాట కలిపి దృష్టి మరల్చి ఒక బంగారు గాజును తస్కరించింది. తర్వాత తనకు డిజైన్లు నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోయింది. మరుసటిరోజు సిబ్బంది ఆభరణాలను లెక్కించే సమయంలో 18 గ్రాముల బరువైన బంగారు గాజు తగ్గినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టగా గుర్తుతెలియని మహిళ చోరీ చేసినట్లు తేలింది. ఈ మేరకు శుక్రవారం తనిష్క్ ప్రతినిధి ప్రవీణ్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. -
ప్రియాంకకు బంగారు గాజులు తొడిగిన సుబ్బరామిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్‌లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి సత్కరించారు. ఆయన వ్యక్తిగత ఫౌండేషన్ టీఎస్ఆర్ తరుపున ఆమెను సన్మానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. సాంస్కృతికకళారంగాల్లో రాణించేవారిని గుర్తించడం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ ఆస్కిత్, శత్రఘ్న సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సత్కరించారు. ఎంపీ సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ప్రియాంక ప్రపంచ నటి అన్నారు. ఆమె నటనను కొనియాడారు. -
ఫ్రీగా అంటూ.. నగలతో మాయం
కంభం (ప్రకాశం జిల్లా) : బంగారానికి ఉచితంగా మెరుగుపెడతామని చెప్పి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం కంభం మండలకేంద్రంలోని గాంధీ బజార్లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలకు మెరుగు పెడుతామంటూ ఓ ఇంట్లోకి వెళ్లారు. వారి మాటలను నమ్మిన శ్వేత అనే మహిళ వారికి నాలుగు బంగారు గాజులను అప్పగించింది. దాహంగా ఉందని, మంచి నీళ్లు కావాలని వారు అడగటంతో ఆమె లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లు తెచ్చేసరికి ఇద్దరు దుండగులు బంగారు గాజులతో పరారయ్యారు. సుమారు 6 తులాల విలువైన గాజులను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


