breaking news
subbaramireddy
-
‘చిరు-పవన్’ సినిమా పక్కా
- మెగా మూవీపై క్లారిటీ ఇచ్చిన టీఎస్ఆర్ హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌లు హీరోలు తాను నిర్మించబోయే మెగా మూవీపై నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్ఆర్) స్పష్టత ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే పక్కాగా సినిమా ఉంటుందని సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిరింజీవి, పవన్ కల్యాణ్‌లు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారని, అవి పూర్తయిన మరుక్షణంలోనే మెగా మూవీ ప్రారంభిస్తామని టీఎస్ఆర్ పేర్కొన్నారు. గ్రాండ్‌గా తెరకెక్కనున్న ఈ మెగా మూవీ తెలుగుసినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని నిర్మాత టీఎస్ఆర్ తెలిపారు. కాగా, ఈ సినిమాకు కథ రెడీ అయిందని ప్రముఖ సినీవిశ్లేషకుడు రమేశ్ బాలా కొద్ది గంటల కిందటే వెల్లడించారు. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమాకు తోడు మరో మూవీకీ కమిట్ అయ్యారు. ఖైదీ 150 హిట్‌తో ఊపుమీదున్న చిరు ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ కి పచ్చజెండా ఊపారు. ఇంకా షూటింగ్ ప్రారంభంకాని ‘ఉయ్యాలవాడ’ పూర్తయిన వెంటనే చిరు చేయబోయే సినిమా టీఎస్ఆర్దే. చిరు, పవన్‌లు ఇద్దరూ రాజకీయనాయకులే కావడంతో కమిటైన సినిమాలు పూర్తయ్యేసరికి ఎన్నికలు ముంచుకొస్తే పరిస్థితి ఏమిటనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినాసరే, ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా చేస్తానని నిర్మాత ప్రకటించడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. -
ప్రియాంకకు బంగారు గాజులు తొడిగిన సుబ్బరామిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్‌లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రాను రాజ్యసభ సభ్యుడు సుబ్బరామి రెడ్డి సత్కరించారు. ఆయన వ్యక్తిగత ఫౌండేషన్ టీఎస్ఆర్ తరుపున ఆమెను సన్మానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. సాంస్కృతికకళారంగాల్లో రాణించేవారిని గుర్తించడం టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక సత్కార కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ ఆస్కిత్, శత్రఘ్న సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సత్కరించారు. ఎంపీ సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ ప్రియాంక ప్రపంచ నటి అన్నారు. ఆమె నటనను కొనియాడారు.