నవ ప్రపంచం కోసం | GOD OF GOD's Movie Audio Launch By Dil Raju | Sakshi
Sakshi News home page

నవ ప్రపంచం కోసం

May 20 2019 12:21 AM | Updated on Jul 12 2019 4:40 PM

GOD OF GOD's Movie Audio Launch By Dil Raju - Sakshi

తేజశ్వీ మనోజ్ఞ

‘‘గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌’ చిత్రం ట్రైలర్‌ నా చేతుల మీదగా విడుదల కావడం నా అదృష్టం. మన దేశంలో ఉన్న మతాలు, వేరే ఏ దేశంలోనూ లేవు. బ్రహ్మకుమారీస్‌ వాళ్లు ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయదలచుకుంటే నేను వాళ్ల వెంట ఉంటాను’’ అన్నారు ‘దిల్‌’ రాజు. వెంకట్‌ గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌’. డివిజన్‌ ఆఫ్‌ బ్రహ్మకుమారీస్‌ సమర్పణలో జగన్‌మోహన్‌ గర్ల్, ఐఎంఎస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజశ్వీ మనోజ్ఞ, త్రియిగమంత్రి, రాజసింహ వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.

శాంతి, ప్రేమ, విలువలతో కూడిన నవ ప్రపంచ పునరుద్ధరణ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియోను ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేసి మాట్లాడుతూ – ‘‘నా వల్ల ఎవరికీ   చెడు జరగకూడదన్నది నా కాన్సెప్ట్‌’’ అన్నారు. ‘‘బ్రహ్మకుమారీస్‌ చేసే సర్వీస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే’’ అన్నారు లయన్‌ సాయి వెంకట్‌. ‘‘ఎన్ని దేశాల్లో మా భక్తులు ఉన్నారన్నది ఈ చిత్రం ద్వారా తెలిసింది’’ అన్నారు కుల్‌దీప్‌ దీదీ. తేజశ్వీ మనోజ్ఞ, వెంకట్‌ గోపాల్, ఐఎంఎస్‌ రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement