గ్లామర్‌నే నమ్ముకున్నా : ఇలియానా | Glamour relied on: Ileana D'Cruz | Sakshi
Sakshi News home page

గ్లామర్‌నే నమ్ముకున్నా : ఇలియానా

Sep 20 2013 1:43 AM | Updated on Apr 3 2019 6:23 PM

గ్లామర్‌నే నమ్ముకున్నా : ఇలియానా - Sakshi

గ్లామర్‌నే నమ్ముకున్నా : ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానాకు హిందీలో బర్ఫీ తొలి సినిమా అయినా, అందులో అద్భుతంగా నటించి విమర్శకులను మెప్పించింది. అయితే నటనా సామర్థ్యం కంటే గ్లామర్‌నే నమ్ముకుంటానని ఇల్లీబేబ్ చెబుతోంది.

న్యూఢిల్లీ: గోవా బ్యూటీ ఇలియానాకు హిందీలో బర్ఫీ తొలి సినిమా అయినా, అందులో అద్భుతంగా నటించి విమర్శకులను మెప్పించింది. అయితే నటనా సామర్థ్యం కంటే గ్లామర్‌నే నమ్ముకుంటానని ఇల్లీబేబ్ చెబుతోంది. అందుకే వాణిజ్య చిత్రాలనే ఎంచుకుంటానంది. బర్ఫీ తరువాత ఫటా పోస్టర్ నిక్లా హీరోలో చాన్స్ సంపాదించింది. రాజ్‌కుమార్ సంతోషి తీసిన ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరో. ‘ప్రతి సినిమాలోనూ బర్ఫీ తరహా పాత్రలు చేయడానికి నేనేం విద్యాబాలన్ కాదు.
 
 ఆమె నిజంగా గొప్ప నటి. విద్యకు గ్లామర్ అవసరమే లేదు. అయితే బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే నాలాంటి వారికి గ్లామర్ తప్పనిసరి. ఇతర హీరోయిన్ల సంగతి చెప్పలేను కానీ దక్షిణాది సినిమాల్లో నేను గ్లామర్‌పైనే ఆధారపడ్డాను. అక్కడ విజయాలు సాధించాను కూడా. మంచి దుస్తుల్లో అందంగా కనిపిస్తే ఫలితం తప్పక కనిపిస్తుంది. అలా సినిమాలు లాగించేయొచ్చు’ అని ఇలియానా వివరిం చింది. బర్ఫీ తరువాత ప్రేక్షకులు తనను అలాంటి పాత్రల్లోనే చూసేందుకు ఇష్టపడే ప్రమాదం ఉంది కాబట్టి ఫటా పోస్టర్‌లో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. 
 
 ‘ప్రేక్షకులు నన్ను ఇది వరకు గ్లామర్ పాత్రల్లోనే చూశారు కాబట్టి బర్ఫీలో నా పాత్ర శ్రుతిని ఇష్టపడరేమోనని మొదట్లో భయపడ్డాను. ఈ సినిమా విడుదలైన తరువాత నన్ను శ్రుతిలాగే చూడడం మొదలుపెట్టారు. అది నాకు నచ్చలేదు. నేను గ్లామర్ హీరోయిన్‌ను... అని వాళ్లకు నచ్చజెప్పడానికే ఫటా పోస్టర్‌లో నటించాను’ అని చెప్పిన ఇలియానా తెలుగులో దేవదాసు, పోకిరి, జల్సా, కిక్ వంటి హిట్ చిత్రాల్లో అలరించింది. ఇక ఫటా పోస్టర్ నిక్లా హీరో శుక్రవారం దేశవిదేశాల్లో విడుదలవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement