గ్లామరస్ పోలీస్ | Glamorous Police | Sakshi
Sakshi News home page

గ్లామరస్ పోలీస్

Jul 21 2015 11:08 PM | Updated on Oct 30 2018 5:58 PM

గ్లామరస్ పోలీస్ - Sakshi

గ్లామరస్ పోలీస్

‘టెంపర్’ సినిమాలో జంతు ప్రేమికురాలి పాత్రలో నటించి, మెప్పించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

 ‘టెంపర్’ సినిమాలో జంతు ప్రేమికురాలి పాత్రలో నటించి, మెప్పించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. టి.నీసన్ దర్శకత్వంలో తమిళంలో విజయ్ సరసన ఆమె నటి ంచిన సూపర్ హిట్ చిత్రం ‘జిల్లా’. మోహన్‌లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి అదే పేరుతో తెలుగు వారికి అందిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది.

నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఓ స్ట్రయిట్ తెలుగు చిత్రం అనిపించేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరాం, సురేఖావాణిలతో చిత్రీకరించాం. ప్రేక్షకులు అచ్చమైన తెలుగు చిత్రం చూస్తున్న అనుభూతికి లోనవుతారు. విజయ్-కాజల్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమాన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహనిర్మాత: నామన శంకర్రావు.
 

Advertisement
 
Advertisement
Advertisement