నాకా భయం లేదు | Glamor characters are not career Problem | Sakshi
Sakshi News home page

నాకా భయం లేదు

Apr 30 2019 2:04 AM | Updated on Apr 30 2019 2:10 AM

Glamor characters are not career Problem - Sakshi

సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా డైరీ ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల జాబితాను పరిశీలిస్తే ఎక్కువగా గ్లామరస్‌ పాత్రలే ఉన్నట్లు అనిపిస్తోంది. కేవలం గ్లామరస్‌ పాత్రలకే పరిమితం అయితే మీ కెరీర్‌కు ప్రాబ్లమ్‌ అవుతుందనిపించడంలేదా? అన్న ప్రశ్నను రాశీఖన్నా ముందు ఉంచితే... ‘‘ప్రస్తుతం ఎక్కువగా గ్లామర్‌ పాత్రలు చేస్తున్నాను. కానీ ఒక మంచి యాక్టర్‌గా నాకు ప్రేక్షకుల మెప్పు దక్కిందనే అనుకుంటున్నాను.

నేను చేస్తున్న కొన్ని కమర్షియల్‌ సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు పోషించినంత మాత్రాన నా కెరీర్‌కు ఏదో ప్రాబ్లమ్‌ అయిపోతుందున్న భయం లేదు నాకు. కథ నచ్చితే స్ట్రాంగ్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ‘ఇమ్మైక్క నొడిగల్‌ (తెలుగులో ‘అంజలి సీబీఐ’), అడంగామారు’ వంటి తమిళ సినిమాల్లో నావి భిన్నమైన పాత్రలే. బాగా యాక్ట్‌ చేశావని అందరూ మెచ్చుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు రాశీ ఖన్నా. ఇక తమిళంలో రాశీ కథానాయికగా నటించిన ‘అయోగ్య’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తెలుగులో వెంకటేశ్, నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమాతో పాటు తమిళంలో ‘సంగ తమిళన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు రాశీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement