breaking news
Glamorous Rolls
-
నాకా భయం లేదు
సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా డైరీ ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల జాబితాను పరిశీలిస్తే ఎక్కువగా గ్లామరస్ పాత్రలే ఉన్నట్లు అనిపిస్తోంది. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం అయితే మీ కెరీర్‌కు ప్రాబ్లమ్ అవుతుందనిపించడంలేదా? అన్న ప్రశ్నను రాశీఖన్నా ముందు ఉంచితే... ‘‘ప్రస్తుతం ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తున్నాను. కానీ ఒక మంచి యాక్టర్‌గా నాకు ప్రేక్షకుల మెప్పు దక్కిందనే అనుకుంటున్నాను. నేను చేస్తున్న కొన్ని కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించినంత మాత్రాన నా కెరీర్‌కు ఏదో ప్రాబ్లమ్ అయిపోతుందున్న భయం లేదు నాకు. కథ నచ్చితే స్ట్రాంగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ‘ఇమ్మైక్క నొడిగల్ (తెలుగులో ‘అంజలి సీబీఐ’), అడంగామారు’ వంటి తమిళ సినిమాల్లో నావి భిన్నమైన పాత్రలే. బాగా యాక్ట్ చేశావని అందరూ మెచ్చుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు రాశీ ఖన్నా. ఇక తమిళంలో రాశీ కథానాయికగా నటించిన ‘అయోగ్య’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తెలుగులో వెంకటేశ్, నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమాతో పాటు తమిళంలో ‘సంగ తమిళన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రాశీ. -
అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది!
ఆ అమ్మాయి పేరు నీరజ. చూడచక్కగా ఉంటుంది. చూడగానే కుర్రకారు లవ్‌లో పడిపోయేంత అందగత్తె. నీరజకు దీటుగా అంతే అందంగా ఉంటుంది ఇందు. ఈవిడగారి కళ్లల్లోకి చూస్తే కుర్రకారు ఫ్లాట్. ఈ ఇద్దరి సంగతి పక్కన పెట్టి, ఆ కుర్రాడి గురించి చెప్పుకుందాం. ఇతగాడు చాకులాంటివాడు. అమ్మాయిల మనసు దోచుకునేంత హ్యాండ్సమ్గా ఉంటాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఈ అబ్బాయి చేసే సందడితో సాగే చిత్రం ‘కొలంబస్’. ఆ కుర్రాడు సుమంత్ అశ్విన్. నీరజగా సీరత్ కపూర్, ఇందు పాత్రను మిస్తీ చక్రవర్తి చేశారు. ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సీరత్ కపూర్ మాట్లాడుతూ -‘‘ఇందులో కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే అమ్మాయి పాత్ర చేశాను. ఒక కొత్త లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉంటుంది. సుమంత్ అశ్విన్ మంచి కో-స్టార్. ‘రన్ రాజా రన్’, ‘టైగర్’ చిత్రాలు నటిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం ఆ పేరును రెట్టింపు చేస్తుందనే నమ్మకం ఉంది. మొదట్లో తెలుగు భాష తెలియకపోవడంతో చాలా ఇబ్బందిపడ్డా. ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నా. నటనకు అవకాశం ఉండే గ్లామరస్ రోల్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి’’ అని చెప్పారు. మరో హీరోయిన్ మిస్తీ చక్రవర్తి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో చలాకీగా, హుందాగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటాయి. అలాగే, ఈ ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. సుమంత్ అశ్విన్‌తో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించింది. యూత్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ‘కొలంబస్’ తర్వాత నాకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయనుకుంటున్నాను. ప్రస్తుతం హిందీలో చేసిన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ విడుదలకు సిద్ధమవుతోంది’’ అన్నారు. -
వాళ్లకు భయపడొద్దు... - రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జిల్’ సినిమాలో గోపీచంద్ పక్కన మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రామ్‌తో ‘శివమ్’లోనూ, రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా కనిపించనుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రాశీఖన్నాతో ‘సాక్షి’ చిట్‌చాట్... ♦ ఫస్ట్ ఓ జనరల్ క్వశ్చన్. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోతున్నారు. ఈ సంఘటనల గురించి మీరు విన్నారా? రిషితేశ్వరి గురించి విన్నాను. టీవీ చానల్స్‌లో న్యూస్ చూశాను. చాలా బాధ అనిపించింది. ర్యాగింగ్ అనే పేరు ఎత్తడానికి వీల్లేనంతగా కఠినమైన నిబంధనలు విధించాల్సిన బాధ్యత కళాశాలలదే. అలాగే, ఫ్రెషర్స్ భయపడకూడదు. యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ప్రతి కళాశాలలోనూ ఓ ఫోరమ్ ఉంటుంది. ఆ ఫోరమ్‌కి కంప్లయింట్ చేయాలి. ♦ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అంటారా? కానే కాదు. అది పిరికితనం. మనం లేకపోతే మనవాళ్లు ఏమైపోతారు? అని ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చేసి మన దారి మనం చూసుకోవడం సరి కాదు. జీవితం ఎంతో విలువైనది. ♦ అత్యాచారం చేసేసి, ఆ తర్వాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయే అబ్బాయిలను ఊరికే వదలొచ్చా? ఇదే విషయమై సుప్రీం కోర్టు ‘పెళ్లి చేసుకున్నా.. దోషి శిక్ష అనుభవించాల్సిందే’ అని తీర్పు ఇచ్చింది.. మీరేమంటారు? ఈ తీర్పుని పూర్తిగా ఆమోదిస్తున్నాను. ‘ఎ రేపిస్ట్ ఈజ్ ఎ రేపిస్ట్’. అత్యాచారం చేసినవాణ్ణిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఘోరమైన పరిష్కారం మరోటి ఉండదు. ఆ అమ్మాయిని కూపంలోకి నెట్టినట్లే. ♦ సినిమాల విషయానికొస్తే... దాదాపు హీరోయిన్లే హీరోల చుట్టూ తిరుగుతారు. సో.. అమ్మాయిలను తక్కువ చేస్తున్నారేమో అంటే మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్లు ఆర్ట్లాంటి వాళ్లు. వాళ్ల అందాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు. కానీ అభ్యంతరకరంగా చూపించడం తప్పు. అలాగే ప్రతి సినిమాలోనూ అమ్మాయిలు హీరోల చుట్టూ తిరుగుతారంటే నేనొప్పుకోను. పరిస్థితుల్లో మార్పొస్తోంది. సో.. కథానాయికలను గ్లామర్ డాల్స్‌లా మాత్రమే చూసే పరిస్థితి పోతుంది. ♦ పదే పదే ఓ అబ్బాయి వెంటపడితే కనికరించి ఐ లవ్ యూ చెప్పాలనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? (నవ్వుతూ) లక్కీగా అలా ఇబ్బందిపడిపోయే సందర్భాలేవీ రాలేదు. ♦ ఇవాళ కథానాయికలు ముప్పై ఏళ్ల తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ మారుతున్నారు లేకపోతే అవకాశాల్లేకుండా మిగిలిపోతున్నారు. కథానాయికల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువనే విషయంపై మీ అభిప్రాయం? ఒక్కసారి గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తే అప్పుడు హీరోల్లా హీరోయిన్స్ కెరీర్‌కి కూడా లాంగ్విటీ ఉంటుంది. కథల్లో మార్పు రావాలి. అప్పుడు మొత్తం ఫిలిం కమ్యూనిటీలో మంచి మార్పొస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఈ మార్పు మొదలైంది. ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. ♦ మీరు ఎవరి ముందు తలవంచాలనుకుంటారు.. అమ్మ, నాన్న, గురువు, దైవం...? నన్ను ఇన్‌స్పయిర్ చేసే వ్యక్తుల ముందు నేను తలవంచడానికి వెనకాడను. అలాగే ఎవరి దగ్గరైనా మంచి విషయాలు నేర్చుకునే వీలు ఉంటే వాళ్లకు తల వంచుతాను. నాకన్నా చిన్నవాళ్లయినా సరే బెండ్ కావడానికి రెడీ అవుతాను. ♦ ఇప్పుడు మీరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబట్టి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మరి.. పేదవాళ్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విధి నిర్ణయం మేరకు అందరూ పుడతారు. హార్డ్ వర్క్‌తో దాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా హార్డ్‌వర్కే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. పేదవాళ్లని చూసినప్పుడు జాలి కలుగుతుంది. ధనవంతులందరూ తమ సంపాదనలో ఐదు శాతం డొనేట్ చేస్తే చాలు.. పేదరికం అనే మాట వినపడదు... మెల్ల్ల మెల్ల్లగా పేదవాళ్లు కనపడరు. ♦ మరి.. మీ సంగతేంటి? సామాజిక సేవ చేస్తుంటారా? తప్పకుండా. కానీ, దాని గురించి చెప్పను. ఎందుకంటే, మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ అంటుంది. ♦ అది సరే.. తెలుగు భాష తెలియకుండా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? నాకు తెలుగు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? భాష తెలియకుండా నటించడం ఈజీ కాదు. అందుకే నా మొదటి సినిమా అప్పుడే నేర్చుకున్నాను. తెలుగు మాట్లాడతాను కానీ, బోల్డన్ని తప్పులొస్తాయి. కాకపోతే బాగా అర్థమవుతుంది. అందుకని, కష్టంగా లేదు. ♦ హిందీలో మీ ఫేవరెట్ హీరో? రణ్‌బీర్ కపూర్.. ♦ తెలుగు ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉంది? రాజమౌళి. ♦ మీరు చేయబోయే పాత్రలు... త్వరలో మీరు నన్ను పోలీసాఫీసర్‌గా చూడబోతున్నారు. ఓ చిత్రంలో ఆ పాత్ర చేస్తున్నా. నాకెప్పుడూ నాన్-గ్లామరస్ రోల్స్ అంటే ఇష్టం. ఒకవేళ గ్లామరస్ రోల్ అయితే అందులో విషయం ఉండాలి. నేను చేసే గ్లామరస్ రోల్స్‌లో విషయం ఉంటుంది. నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమాభి మానాలు కూడా నా సక్సెస్‌కి కారణం. - డి.జి. భవాని -
అవసరమైతే అందవిహీనంగా కనిపిస్తా!
పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంటారు తమన్నా. ఈ మెరుపు తీగ అందం చూడటానికి రెండు కళ్లూ చాలవని అబ్బాయిలంటుంటారు. ఆ అభినందనకు మురిసిపోతూనే... ‘నేను అందవిహీనంగా కనిపించినా చూడ్డానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ముందుగా ఓ హింట్ ఇచ్చేస్తున్నారు తమన్నా. ఇప్పటివరకు దాదాపు గ్లామరస్ రోల్స్ చేసిన తమన్నాకు... పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామరైజ్డ్గా కూడా కనిపించాలని ఉందట. ఈ విషయాన్నే ఆమె చూచాయగా సెలవిచ్చారు. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోలే డామినేట్ చేస్తారు కదా... అప్పుడు ఎలా అనిపిస్తుంది? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘అందులో వాస్తవం ఉంది. అయితే... ఓ సినిమాకి హీరోలు ఎంత ముఖ్యమో హీరోయిన్లూ అంతే ముఖ్యం. హీరోయిన్లు లేని సినిమాలను ఊహించలేం కదా! హీరోల పాత్రలతో పోల్చితే మా పాత్ర నిడివి తక్కువగా ఉండొచ్చేమో. కానీ, ఆ కాస్త సమయమే సినిమాకు కళ కూడా. ఇక నా విషయానికొస్తే.. పాత్ర నిడివి ఎంత? అని ఎప్పుడూ నేను ఆలోచించలేదు. తెరపై కనిపించే తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో రెండు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తమన్నా. తమిళంలో కూడా సినిమాలు అంగీకరించారట. కోట్లు సంపాదిస్తున్నారు కదా.. బాగా ఖర్చు పెడతారా? అని తమన్నాని అడిగితే -‘‘డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెట్టడం నాకిష్టం ఉండదు. నాక్కావల్సినవి మాత్రమే కొనుక్కుంటా. అనవసర ఆడంబరాలకు పోను’’ అన్నారు.