అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది! | Columbus Movie Sensor Report | Sakshi
Sakshi News home page

అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది!

Oct 20 2015 1:27 AM | Updated on Sep 3 2017 11:12 AM

అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది!

అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది!

ఆ అమ్మాయి పేరు నీరజ. చూడచక్కగా ఉంటుంది. చూడగానే కుర్రకారు లవ్‌లో...

ఆ అమ్మాయి పేరు నీరజ. చూడచక్కగా ఉంటుంది. చూడగానే కుర్రకారు లవ్‌లో పడిపోయేంత అందగత్తె. నీరజకు దీటుగా అంతే అందంగా ఉంటుంది ఇందు. ఈవిడగారి కళ్లల్లోకి చూస్తే కుర్రకారు ఫ్లాట్. ఈ ఇద్దరి సంగతి పక్కన పెట్టి, ఆ కుర్రాడి గురించి చెప్పుకుందాం.  ఇతగాడు చాకులాంటివాడు. అమ్మాయిల మనసు దోచుకునేంత హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఈ అబ్బాయి చేసే సందడితో సాగే చిత్రం ‘కొలంబస్’. ఆ కుర్రాడు సుమంత్ అశ్విన్. నీరజగా సీరత్ కపూర్, ఇందు పాత్రను మిస్తీ చక్రవర్తి చేశారు. ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ సందర్భంగా సీరత్ కపూర్ మాట్లాడుతూ -‘‘ఇందులో కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే అమ్మాయి పాత్ర చేశాను. ఒక కొత్త లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉంటుంది. సుమంత్ అశ్విన్ మంచి కో-స్టార్. ‘రన్ రాజా రన్’, ‘టైగర్’ చిత్రాలు నటిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం ఆ పేరును రెట్టింపు చేస్తుందనే నమ్మకం ఉంది. మొదట్లో తెలుగు భాష తెలియకపోవడంతో చాలా ఇబ్బందిపడ్డా. ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నా. నటనకు అవకాశం ఉండే గ్లామరస్ రోల్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.
 
మరో హీరోయిన్ మిస్తీ చక్రవర్తి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో చలాకీగా, హుందాగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటాయి. అలాగే, ఈ ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. సుమంత్ అశ్విన్‌తో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించింది. యూత్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ‘కొలంబస్’ తర్వాత నాకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయనుకుంటున్నాను. ప్రస్తుతం హిందీలో చేసిన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ విడుదలకు సిద్ధమవుతోంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement