ఫిబ్రవరి 17న రానా ఘాజీ | Ghazi Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 17న రానా ఘాజీ

Jan 10 2017 11:42 AM | Updated on Aug 11 2019 12:52 PM

ఫిబ్రవరి 17న రానా ఘాజీ - Sakshi

ఫిబ్రవరి 17న రానా ఘాజీ

టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ'

టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే టైటిల్ లోగో పాటు నావెల్ ఆఫీసర్గా రానా లుక్ను రివీల్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణిలు కనిపిస్తున్న ఈ పోస్టర్లో సబ్ మెరైన్ లోపలి దృశ్యాలను కూడా చూపించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement