ఒకేసారి బాబాయ్, అబ్బాయ్ | Ghazi, guru Teasers | Sakshi
Sakshi News home page

ఒకేసారి బాబాయ్, అబ్బాయ్

Jan 11 2017 1:01 PM | Updated on Aug 11 2019 12:52 PM

ఒకేసారి బాబాయ్, అబ్బాయ్ - Sakshi

ఒకేసారి బాబాయ్, అబ్బాయ్

యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి

యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాజీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్కు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రయూనిట్ టీజర్ను రిలీజ్ చేసింది. సినిమా నేపథ్యంతో పాటు సముద్ర గర్భంలో నావీ టీం చేసే అద్భుత విన్యాసాలను ట్రైలర్లో చూపించారు. తెలుగుతో పాటు ఘాజీ హిందీ, తమిళ టీజర్లను కూడా ఒకేసారి రిలీజ్ చేశారు.

ఘాజీ టీజర్ తో పాటు సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న గురు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. గతంలో వెంకీ లుక్ ను మాత్రమే రివీల్ చేసిన యూనిట్, కొత్త టీజర్ లో వెంకీ క్యారెక్టరైజేషన్ ను చూపించారు. రఫ్ లుక్ లో బాక్సింగ్ కోచ్ గా కనిపిస్తున్న వెంకీ అబ్బాయి రానాకి పోటీ ఇచ్చేలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement