గెట్ రెడీ టు థ్రిల్ | Get Ready To Thrill | Sakshi
Sakshi News home page

గెట్ రెడీ టు థ్రిల్

Nov 10 2016 11:12 PM | Updated on Sep 4 2017 7:44 PM

గెట్ రెడీ టు థ్రిల్

గెట్ రెడీ టు థ్రిల్

‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. టీజర్ చూసినవారు చాలా ఆసక్తిగా ఉందంటున్నారు.

‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. టీజర్ చూసినవారు చాలా ఆసక్తిగా ఉందంటున్నారు. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది’’ అన్నారు హీరో నిఖిల్. ఆయన హీరోగా, హెబ్బా పటేల్, నందిత శ్వేత కథానాయికలుగా ఐవీ ఆనంద్ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం నవ్వులు పంచే చిత్రం ఇది.

థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. ‘వెన్నెల’ కిశోర్‌గారు బాగా నవ్విస్తారు. నా గత చిత్రాల్లాగా ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గెట్ రెడీ టు థ్రిల్’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల కిందట నా స్నేహితుడు చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. మేం అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. ఈ నెల 18న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేశ్, జోష్ రవి, అపూర్వ శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్.

Advertisement
 
Advertisement
Advertisement