మలయాళ సినిమాలోనూ... దర్శకుడిగానే!

Gautham Vasudev Menon in Kochi for the audio launch of Naam - Sakshi

తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కి నటన కొత్తేమీ కాదు! ఎక్కువగా ఆయన సినిమాల్లో అతిథి పాత్రల్లో ప్రేక్షకులకు కన్పిస్తుంటారు. అయితే.. ఇప్పటివరకూ తమిళ, తెలుగు సినిమాల్లోనే ఈ దర్శకుడు నటించారు. ఇప్పుడు మలయాళ సినిమా ‘నామ్‌’లో నటించారు. జోషీ థామస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గౌతమ్‌ మీనన్‌ దర్శకుడిగానే కనిపించనున్నారు.

విశేషం ఏంటంటే... గౌతమ్‌ మీనన్‌ దర్శకుడు అయిన తర్వాత  రెండుసార్లు బయట దర్శకుల సినిమాల్లో అతిథి పాత్రల్లో దర్శకుడిగానే కనిపించారు. ఇప్పుడీ మలయాళ సినిమాలోనూ దర్శకుడిగానే నటించారు. ముగ్గురు దర్శకులూ గౌతమ్‌ మీనన్‌ని దర్శకుడిగా అతిథి పాత్రల్లో కనిపించమని అడగడం యాదృచ్చికం అనుకోవాలేమో!! కొంతమంది స్నేహితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేసే వ్యక్తిగా ‘నామ్‌’లో గౌతమ్‌ మీనన్‌ కనిపిస్తారట!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top