breaking news
naam
-
మలయాళ సినిమాలోనూ... దర్శకుడిగానే!
తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌కి నటన కొత్తేమీ కాదు! ఎక్కువగా ఆయన సినిమాల్లో అతిథి పాత్రల్లో ప్రేక్షకులకు కన్పిస్తుంటారు. అయితే.. ఇప్పటివరకూ తమిళ, తెలుగు సినిమాల్లోనే ఈ దర్శకుడు నటించారు. ఇప్పుడు మలయాళ సినిమా ‘నామ్’లో నటించారు. జోషీ థామస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కనిపించనున్నారు. విశేషం ఏంటంటే... గౌతమ్ మీనన్ దర్శకుడు అయిన తర్వాత రెండుసార్లు బయట దర్శకుల సినిమాల్లో అతిథి పాత్రల్లో దర్శకుడిగానే కనిపించారు. ఇప్పుడీ మలయాళ సినిమాలోనూ దర్శకుడిగానే నటించారు. ముగ్గురు దర్శకులూ గౌతమ్ మీనన్‌ని దర్శకుడిగా అతిథి పాత్రల్లో కనిపించమని అడగడం యాదృచ్చికం అనుకోవాలేమో!! కొంతమంది స్నేహితులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేసే వ్యక్తిగా ‘నామ్’లో గౌతమ్ మీనన్ కనిపిస్తారట!! -
సర్వర్ సమస్యలతో ‘నామ్’ సతమతం
♦ రద్దీవేళల్లో మార్కెటింగ్ ప్రక్రియలో ఇబ్బందులు.. ♦ రైతుల పాట్లు సమస్యలు పరిష్కరించాలంటూ హరీశ్ లేఖ సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(నామ్) పథకం సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో పారదర్శకతను పెం చేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నామ్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామ్ పథకం కింద రాష్ట్రం నుంచి 44 మార్కెట్లను ఎంపిక చేయగా తొలి విడతలో ఐదు మార్కెట్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నిజామాబాద్(పసుపు), తిరుమలగిరి(ధాన్యం), వరంగల్(మక్కలు), హైదరాబాద్(మిర్చి), బాదేపల్లి(ధాన్యం) యార్డుల్లో ‘ఈ టెండరింగ్’ విధానంలో లావాదేవీలు ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐదు మార్కెట్‌యార్డుల్లో రూ.111.38కోట్ల విలువ చేసే 17,379 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉండగా సర్వర్ సమస్యలతో ‘నామ్’ పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. రద్దీవేళల్లో నెమ్మదించడంతో నిర్దేశిత సమయంలోగా మార్కెటింగ్ ప్రక్రియను పూర్తిచేయడంలో వ్యాపారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మ రోవైపు వ్యవసాయ ఉత్పత్తులతో మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. గేట్ ఎంట్రీలోనూ సమస్యలు మరో 39 వ్యవసాయ మార్కెట్లను నామ్ పథకం అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూలై 11 నుంచి మార్కెట్‌కు తరలివచ్చే ధాన్యం వివరాలను గేట్ ఎంట్రీ విధానంలో నమోదు చేస్తున్నారు. సర్వర్ సమస్యలతో గేట్ ఎంట్రీ ప్రక్రియ సకాలంలో పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలో నామ్ సర్వర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల లేఖ రాశారు. సులభ మార్కెటింగ్ కార్యకలాపాలకు వీలుగా రూపొందిస్తున్న మొబైల్ యాప్ ను వీలైనంత త్వరగా అందజేయాలని కోరా రు. వ్యాపారులకు ఉత్పత్తులవారీగా ధరల జాబితాను ఇవ్వడం ద్వారా వేలం ప్రక్రియ మరింత సులభమవుతుందన్నారు. -
వరంగల్ మార్కెట్లో స్తంభించిన నామ్ సేవలు
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం నామ్ సేవలు స్థంభించాయి. దీంతో అన్ని పంట సరుకులకు జెండా పాట ద్వారానే ధర నిర్ణయించగా, క్రయవిక్రయాలు జరిగాయి. నామ్ ద్వారా పంట సరుకుల క్రయవిక్రయాలకు ఎన్ఎఫ్సీఎల్ సహకారంతో సాఫ్ట్వేర్ అందించగా, సాంకేతిక కారణాలతో సర్వర్ డౌన్ అయింది. దీంతో గేట్ ఎంట్రీలు ఇవ్వడం కుదరకపోవడంతో కార్యదర్శి రాజు ఆదేశాల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా జెండా వేలం పాటలు చేపట్టారు. కాగా, యార్డు ఇన్చార్జిల అంశంపై కార్యదర్శి రాజు మాట్లాడుతూ కేటాయించిన విధుల్లో చేరేందుకు మరో రెండు రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు.