‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌లో స్టార్‌ డైరెక్టర్

Gautham Menon to Star in Arjun Reddy Remake Aditya Varma - Sakshi

టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ధృవ్‌ విక్రమ్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్‌ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్త తెరకెక్కిస్తున్న రీమేక్‌లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్.

తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో హీరోగా తండ్రి పాత్రలో సౌత్ స్టార్ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ నటిస్తున్నారట. ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా తాను నిర్మించిన సినిమాలన్నీ ఆగిపోవటంతో గౌతమ్‌ మీనన్‌ పూర్తి నటన మీద దృష్టిపెట్టాడు. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన గౌతమ్‌, అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో మాత్రం ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవ్‌ సరసన బానిటా సంధు హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రియా ఆనంద్, అన్బులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top