‘తను 3 గంటల పాటు సింగారించుకుంటాడు’ | Gauri Khan Reveals A Secret About Husband Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

భర్త సీక్రెట్‌ రివీల్‌ చేసిన గౌరీ ఖాన్‌

Apr 1 2019 4:50 PM | Updated on Apr 1 2019 5:01 PM

Gauri Khan Reveals A Secret About Husband Shah Rukh Khan - Sakshi

బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్‌ దంపతులు. పెళ్లై పాతికేళ్లు దాటినప్పటికి నేటికి కూడా కొత్తగా పైళ్లైన జంటలా అన్యోన్యంగా ఉంటారు. సోషల్‌ మీడియాలో త్రోబ్యాక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కపుల్‌ గోల్స్‌ని సెట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో షారుఖ్‌ - గౌరీ జంట మోస్ట్‌ స్టైలీష్‌ కపుల్‌ అవార్డ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా గౌరీ ఖాన్‌ తన భర్తకు సంబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.

ఈ వీడియోలో విలేకరి మీ ఇద్దరిలో తయారవ్వడానికి ఎవరు ఎక్కువ సమయం తీసుకుంటారని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా గౌరీ.. ‘షారుఖ్‌ ఖాన్‌ డ్రెస్సింగ్‌కు చాలా మంది అభిమానులున్నారు. అందంగా కనిపించడం కోసం షారుఖ్‌ ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోడని మీలో చాలామంది అనుకుంటారు. కానీ మీకో రహస్యం చెప్తున్నా. షారుక్‌ గంటల తరబడి అలంకరించుకుంటాడు. మేమిద్దరం కలిసి బయటకు వెళ్లాలనుకున్నా.. లేదా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉన్నా నేను ఎగ్జాట్‌గా 20 నిమిషాల్లో రెడీ అవుతాను. కానీ మా ఆయన సింగారం పూర్తవ్వడానికి మాత్రం 2, 3 గంటల సమయం పడుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement