'గంగ' కూడా వాయిదా పడింది.. | Ganga Movie Release Postponed again | Sakshi
Sakshi News home page

'గంగ' కూడా వాయిదా పడింది..

May 1 2015 10:56 AM | Updated on Sep 3 2017 1:14 AM

'గంగ' కూడా వాయిదా పడింది..

'గంగ' కూడా వాయిదా పడింది..

మరో భారీ చిత్రం విడుదల కూడా నిలిచిపోయింది. రాఘవ లారెన్స్ నటించిన 'గంగా' (కాంచన-2) సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది.

హైదరాబాద్ : మరో భారీ చిత్రం విడుదల కూడా నిలిచిపోయింది. రాఘవ లారెన్స్ నటించిన 'గంగా' (కాంచన-2) సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. తమిళంలో భారీ హిట్ అయిన ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాతలు దిల్ రాజు, బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు. గంగా పేరుతో తెలుగులో వస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ నటించింది.

అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే రిలీజ్ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన ఉత్తమ విలన్ చిత్రం విడుదల కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement