breaking news
kanchana-2
-
భయపెట్టనున్న అక్షయ్
... మీరు చదివింది నిజమే.. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ భయపెట్టనున్నారు. ‘2.0’లో క్రౌమ్యాన్ క్యారెక్టర్ గురించి చెప్పడంలేదు. ఇది వేరే సినిమా. అసలు విషయానికొస్తే.. నృత్య దర్శకునిగా, దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌ని నటుడిగా ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసిన చిత్రం ‘కాంచన’. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు లారెన్స్. అటు తమిళంలో, ఇటు తెలుగులో ‘కాంచన’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ‘కాంచన’కి సీక్వెల్‌గా ‘కాంచన 2’ వచ్చింది. ప్రస్తుతం లారెన్స్ ‘కాంచన 3’ షూటింగ్లో ఉన్నారు. అంతలా సౌత్ ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ‘కాంచన 2’ సినిమాని రీమేక్ చేయనున్నారు. లారెన్స్ పాత్రలో అక్షయ్ బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ప్రేరణా అరోరా, అర్జున్ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. -
'గంగ' కూడా వాయిదా పడింది..
హైదరాబాద్ : మరో భారీ చిత్రం విడుదల కూడా నిలిచిపోయింది. రాఘవ లారెన్స్ నటించిన 'గంగా' (కాంచన-2) సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. తమిళంలో భారీ హిట్ అయిన ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాతలు దిల్ రాజు, బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు. గంగా పేరుతో తెలుగులో వస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ నటించింది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే రిలీజ్ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన ఉత్తమ విలన్ చిత్రం విడుదల కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.