భయపెట్టనున్న అక్షయ్‌ | Akshay Kumar In HORROR Movie Kanchana 2 Remake | Sakshi
Sakshi News home page

భయపెట్టనున్న అక్షయ్‌

Feb 10 2018 12:40 AM | Updated on Feb 10 2018 12:40 AM

Akshay Kumar In HORROR Movie Kanchana 2 Remake  - Sakshi

అక్షయ్‌కుమార్‌

... మీరు చదివింది నిజమే.. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ భయపెట్టనున్నారు. ‘2.0’లో క్రౌమ్యాన్‌ క్యారెక్టర్‌ గురించి చెప్పడంలేదు. ఇది వేరే సినిమా. అసలు విషయానికొస్తే.. నృత్య దర్శకునిగా, దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌ని నటుడిగా ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసిన చిత్రం ‘కాంచన’. హారర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు లారెన్స్‌. అటు తమిళంలో, ఇటు తెలుగులో ‘కాంచన’ ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ‘కాంచన’కి సీక్వెల్‌గా ‘కాంచన 2’ వచ్చింది. ప్రస్తుతం లారెన్స్‌ ‘కాంచన 3’ షూటింగ్‌లో ఉన్నారు. అంతలా సౌత్‌ ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్‌ కానుంది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘కాంచన 2’ సినిమాని రీమేక్‌ చేయనున్నారు. లారెన్స్‌ పాత్రలో అక్షయ్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను భయపెట్టనున్నారు.  ప్రేరణా అరోరా, అర్జున్‌ కపూర్‌ నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement