గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అభిమానులకు చేదువార్త | Game of Thrones Season 7 episode 4 leak | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అభిమానులకు చేదువార్త

Aug 5 2017 4:00 PM | Updated on Sep 17 2017 5:12 PM

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అభిమానులకు చేదువార్త

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అభిమానులకు చేదువార్త

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అమెరికన్‌ ఫాంటసీ, యాక్షన్‌ సీరియల్‌.

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అమెరికన్‌ ఫాంటసీ, యాక్షన్‌ సీరియల్‌. ఈ సిరీస్‌ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్‌ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ సీరియల్‌ అభిమానులు ఇప్పుడు ట్విట్టర్‌లో హాట్‌స్టార్‌ యాజమాన్యంపై రెచ్చిపోయారు.

వివరాల్లోకి వెళ్తే సీజన్‌7 ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈసిరీస్‌ భారత్‌లో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్‌ అవుతోంది. ఇప్పటి మూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న గేమ్స్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ నాలుగో ఎపిసోడ్‌ ఆగస్టు 7, సోమవారం ప్రసారం కావాల్సి ఉంది. అయితే హాట్‌స్టార్‌ అప్లికేషన్‌ తప్పిదం వల్ల ఆన్‌లైన్‌లో లీకైంది. వీడియోను పైరసీ చేసి ఇంటర్నెట్‌, టోరెంట్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అభిమానులు ట్వట్టర్‌లో రెచ్చిపోయారు. హాట్‌స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement