బన్నీ సినిమాకు గబ్బర్సింగ్ సెంటిమెంట్ | Gabbarsingh Sentiment For Allu Arjun Duvvada Jagannatham | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమాకు గబ్బర్సింగ్ సెంటిమెంట్

Feb 8 2017 1:27 PM | Updated on Sep 5 2017 3:14 AM

బన్నీ సినిమాకు గబ్బర్సింగ్ సెంటిమెంట్

బన్నీ సినిమాకు గబ్బర్సింగ్ సెంటిమెంట్

సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో

సరైనోడు సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ  కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సమ్మర్ రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను మార్చిలో రిలీజ్ చేయాలని భావించారు.

అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఫస్ట్ లుక్ టీజర్ను మహా శివరాత్రి రోజునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ గబ్బర్సింగ్ టీజర్ కూడా మహా శివరాత్రి రోజునే రిలీజ్ అయ్యింది. ఆ సెంటిమెంట్ను డిజె విషయంలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement