నిర్మాతైన జీవీ తల్లి | G.V. Prakash's mom becomes producer for a funny titled film | Sakshi
Sakshi News home page

నిర్మాతైన జీవీ తల్లి

Jul 29 2016 2:09 AM | Updated on Sep 4 2017 6:46 AM

నిర్మాతైన జీవీ తల్లి

నిర్మాతైన జీవీ తల్లి

యువ సంగీతదర్శకుడు, కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ నిర్మాతగానూ మారి మదయానైకూట్టం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

యువ సంగీతదర్శకుడు, కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ నిర్మాతగానూ మారి మదయానైకూట్టం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తల్లి, ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ పెద్ద అక్క అయిన రెహైనా నిర్మాతగా అవతారమెత్తారు. ఈమెలో మంచి గాయనీ, సంగీత దర్శకురాలు ఉన్నారు. తొలుత తన సోదరుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంలో కోరస్‌లో పాడిన రెహైనా ఆ తరువాత గాయనిగా కొన్ని పాటలు పాడారు.అదే విధంగా నటుడు దుశ్యంత్ హీరోగా నటించన మచ్చి చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా రంగప్రవేశం చేశారు.
 
 ఆపై ఆడాద ఆటమెల్లాం, ఎన్నై ఏదో చెయ్‌దు విట్టాయ్ తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. కాగా తాజాగా నిర్మాతగా మారి యోగి అండ్ ఫ్రెండ్స్ పతాకంపై ఏండా తలైక్కు ఎన్నై తేయ్‌క్కలై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆచార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సంచింతాశెట్టి నాయకిగా నటిస్తున్నారు.ఈ చిత్రం ద్వార విఘ్నేశ్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇది కామెడీతో కూడిన ఫాంటసీ కథా చిత్రం అట. ఈ చిత్రం తరువాత రెహైనా తన కొడుకు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా ఒక చిత్రం చేయనున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement