ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

Frozen 2 press meet with Nithya Menon, Namrata Shirodkar - Sakshi

– నిత్యా మీనన్‌

‘‘ఫ్రోజెన్‌’ సినిమా చూసిన నా ఫ్రెండ్‌ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది.  నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్‌ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్‌చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్‌ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్‌లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్‌ బాబు కుమార్తె సితార డబ్బింగ్‌ చెప్పారు.

ఈ సందర్భంగా నిత్యామీనన్‌ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్‌ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్‌ 2’లో ఎల్సాకు డబ్బింగ్‌ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్‌ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్‌ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యారు. నా ఫేవరెట్‌ కార్టూన్‌ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్‌ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్‌ చేశారు.

సితార ఎలా డబ్బింగ్‌ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్‌. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్‌ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్‌. ‘‘2013లో ‘ఫ్రోజెన్‌’ చిత్రం రిలీజ్‌ అయింది. యానిమేషన్‌ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్‌ దుగ్గల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top