'సోనమ్ కపూర్ బికినీ' తప్ప.. ఏం పట్టవా? | Focus on Sonam's bikini scene in film disappointing: Director Mumbai | Sakshi
Sakshi News home page

'సోనమ్ కపూర్ బికినీ' తప్ప.. ఏం పట్టవా?

Mar 11 2014 3:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

'సోనమ్ కపూర్ బికినీ' తప్ప.. ఏం పట్టవా? - Sakshi

'సోనమ్ కపూర్ బికినీ' తప్ప.. ఏం పట్టవా?

'బేవకూఫియాన్'లో 28 ఏళ్ల సోనమ్ బికినీతో అందాలను ఆరబోసింది. ఈ స్టిల్స్ అభిమానుల్ని తెగ ఆకర్షించాయి.

ముంబై: బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ముద్దుల తనయ, అందాల హీరోయిన్ సోనమ్ కపూర్ రెండేళ్ల క్రితం బికినీ సన్నివేశాల్లో నటించేదిలేదంటూ తెగేసి చెప్పింది. అంతేగాక అందుకు తన శరీరం వొప్పదంటూ సెలవిచ్చింది. అయితే ఈ అమ్మడు రూట్ మార్చి గ్లామర్ బాట ఎంచుకుంది. తాజా చిత్రం 'బేవకూఫియాన్'లో 28 ఏళ్ల సోనమ్ బికినీతో అందాలను ఆరబోసింది. ఈ స్టిల్స్ అభిమానుల్ని తెగ ఆకర్షిస్తున్నాయి. ఇంకేముంది కుర్రకారు దృష్టంతా సోనమ్ బికినీపైనే. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదో హాట్ టాపిక్గా మారింది. తండ్రి అనిల్ కూడా సోనమ్ను సమర్థించారు. ఏమైతేనేం 'బేవకూఫియాన్' సినిమాకు ఫ్రీగా ప్రచారం తెచ్చిపెట్టింది. ఇందుకు ఆ సినిమా డైరెక్టర్ నుపుర్ అస్థానా సంతోషించాల్సిపోయి నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  

బాలీవుడ్ జనాలు సోనమ్ బికినీ గురించి మాట్లాడుకుంటారా? అంటూ నుపుర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రోమోలో ఇతర ఆసక్తికర విషయాలూ ఉన్నాయని, వాటి గురించి పట్టించుకోరేం అంటూ నిష్టూరమాడారు. అయితే ఈ సినిమా చూస్తే అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో సోనమ్ లిప్ లాక్ సీన్లలో రక్తికట్టించిందని గుసగుసలాడుకుంటున్నారు. అయితే కావాలని ఈ సన్నివేశాలను పెట్టలేదని నుపుర్ ముక్తాయించారు. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే.. అంటూ తరచూ వినే మాటే కదా! ఏమైతేనేం సోనమ్ బికినీ సీన్ హాట్ టాపిక్గా మారింది. ఏమాత్రం వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement