లాంగ్ గ్యాప్ తర్వాత ఇంటికి : మంచు విష్ణు | Flying back home after long schedule, Tweets Vishnu | Sakshi
Sakshi News home page

లాంగ్ గ్యాప్ తర్వాత ఇంటికి : మంచు విష్ణు

Oct 16 2017 5:44 PM | Updated on Oct 16 2017 5:51 PM

Flying back home after long schedule, Tweets Vishnu

సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ఓ రిస్కీ షాట్ తీస్తున్నప్పుడు బైక్‌ మీద నుంచి పడిపోయి గాయాలపాలైనా.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొన్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. అయితే సుదీర్ఘ విదేశీ షెడ్యూలు తర్వాత నగరానికి రానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచారి అమెరికా యాత్ర’ లో కథానాయకుడు విష్ణు. ‘నలభై రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ముగియడంతో ఇంటికి తిరిగొస్తున్నాను. లాస్ ఏంజెల్స్, సీటెల్ లో షెడ్యూల్ పూర్తయింది. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ రోజులను ఎంతగానో ఎంజాయ్ చేశానంటూ’ ట్వీట్లో రాసుకొచ్చారు.

విష్ణు లేటెస్ట్ మూవీ షూటింగ్ మలేషియా, లండన్, డబ్లిన్, లాస్‌ ఏంజిల్స్‌లలో జరిగింది. ఆ మధ్య మలేసియాలో జరిగినప్పుడు విష్ణు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నప్పుడు బైక్‌ మీద నుంచి విష్ణు అమాంతం పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ హీరో విష్ణు డాక్టర్ల సలహా మేరకు దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు. కాస్త ఫర్వాలేదనిపించడంతో ఇక నో రెస్ట్‌ అని బిజీ షెడ్యూళ్లలో పాల్గొన్నారు. మరికొన్ని రోజులు విశ్రాంతి అవరసరమైనా.. తన కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలగడంతో విష్ణు మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేసి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement