సరికొత్త లుక్‌తో రాధా | First Look: Venkatesh as ''Radha'' | Sakshi
Sakshi News home page

సరికొత్త లుక్‌తో రాధా

Feb 6 2014 10:58 PM | Updated on Sep 2 2017 3:24 AM

సరికొత్త లుక్‌తో రాధా

సరికొత్త లుక్‌తో రాధా

వెంకటేశ్, నయనతార కాంబినేషన్‌లో ‘రాధా’ చిత్రం మొదలైంది. మారుతి దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 వెంకటేశ్, నయనతార కాంబినేషన్‌లో ‘రాధా’ చిత్రం మొదలైంది. మారుతి దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మారుతికి అల్లు అరవింద్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘నా ‘బస్టాప్’ సినిమా చూసి వెంకటేశ్ పిలిపించారు. అప్పటి నుంచీ ఆయనతో ట్రావెల్ అవుతున్నా. ఆయన ఇమేజ్‌కి తగిన లవ్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో కచ్చితంగా కొత్త వెంకటేశ్‌ని చూస్తారు. డైలాగ్స్ నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకూ అన్నీ కొత్తగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి., ఛాయా గ్రహణం: రిచర్డ్ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి.
 

Advertisement
 
Advertisement
Advertisement