విలన్‌ విజయ్‌ | Sakshi
Sakshi News home page

విలన్‌ విజయ్‌

Published Tue, Feb 11 2020 1:55 AM

First look poster of Vijay Sethupathi from Uppena - Sakshi

హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథానాయికగా కృతీ శెట్టి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.

మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో అంబాసిడర్‌ కారుకు ఆనుకొని నిలబడి ఓ లుక్‌ ఉండగా, సిగరెట్‌ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్న మరో లుక్‌లో విజయ్‌ సేతుపతి కనిపిస్తున్నారు. హీరోగా తమిళంలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న విజయ్‌ సేతుపతిది ఇందులో విలన్‌ పాత్ర కావడం విశేషం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అనిల్‌ వై., అశోక్‌ బి, సీఈవో: చెర్రీ, కెమెరా: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్, సంగీత దర్శకుడు: దేవి శ్రీప్రసాద్‌. 

Advertisement
Advertisement