మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం | fire accident in mahesh babu movie setting | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం

Nov 1 2016 1:08 PM | Updated on Sep 5 2018 9:47 PM

మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం - Sakshi

మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం

మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్ 87లో వేసిన సెట్లో షూటింగ్...

మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్ 87లో వేసిన సెట్లో షూటింగ్ జరుగుతుండగా మంగళవారం ఉదయం సెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

టపాకాయలు కాల్చిన నిప్పురవ్వలు పడటంతో లోకేషన్ లోని టెంట్లు ఇతర సామాగ్రికి నిప్పంటుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికి షూటింగ్ మొదలు కాకపోవటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ సెట్ పూర్తిగా కాలిపోవటంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి సంబందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement