అభిమాన నటున్ని కలిసిన డాన్సింగ్‌ అంకుల్‌ | Finally Dancing Uncle Met His Favourite Actor | Sakshi
Sakshi News home page

అభిమాన నటున్ని కలిసిన డాన్సింగ్‌ అంకుల్‌

Jun 14 2018 4:28 PM | Updated on Jun 14 2018 6:24 PM

Finally Dancing Uncle Met His Favourite Actor - Sakshi

అభిమాన నటుడు గోవిందాతో డాన్సింగ్‌ అంకుల్‌ సంజీవ్‌ శ్రీవాస్తవ

డాన్సింగ్‌ వీడియోతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యాడు ‘డాన్సింగ్‌ అంకుల్‌’ సంజీవ్‌ శ్రీవాస్తవ. ఇతనికి హీరో గోవిందా అంటే ఎంత అభిమానమో తెలిసిందే. శ్రీవాస్తవ తన అభిమాన హీరో గోవిందాను అనుకరిస్తూ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయము తెలిసిందే. శ్రీవాస్తవ చేసిన డాన్స్‌కు గోవిందా కూడా ఫిదా అయ్యాడు. ఫోన్‌ చేసి మరి శ్రీవాస్తవను అభినందించడమే కాక కలుస్తానని కూడా మాటిచ్చాడు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చడానికి మాధురి దీక్షిత్‌ డాన్స్‌ రియాలిటీ షో ‘డాన్స్‌ దివానే’ కార్యక్రమం అందుకు వేదికయ్యింది.

ఈ షోలో గోవిందా ‘డాన్సింగ్‌ అంకుల్‌’ కలవడమే కాక అతనితో పాటు కాలు కదిపి ప్రేక్షకులను అలరించాడు. ‘డాన్స్‌ దివానే షో’ ద్వారా మాధురి దీక్షిత్‌తో కూడా డాన్స్‌ చేసే అవకాశం లభించింది ‘డాన్సింగ్‌ అంకుల్‌’కు. ఈ షోలో మాధురి కూడా శ్రీవాస్తవ, గోవిందాలతో పాటు డాన్స్‌ చేసింది. ‘డాన్సింగ్‌ అంకుల్‌’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement