తన పెళ్లి వార్తలపై స్పందించిన సాయి పల్లవి

Fidaa Heroine Sai Pallavi Interesting Comments On Her Marriage - Sakshi

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి పల్లవి. తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌ స్టెప్పులతో అలరిస్తున్న ఈ కేరళ నటికి యూత్‌తో మంచి క్రేజ్‌ ఉంది. అతితక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్థిరపడిపోయిన ఈ నటి కెరీర్‌ బెస్ట్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక హీరోహీరోయిన్ల ఖాతాలో నాలుగు సినిమా హిట్లు పడి కొంచెం పాపులర్‌ అయిన వెంటనే అందరి దృష్టి వారి పెళ్లిపై పడుతుంది. ఈ క్రమంలో సాయి పల్లవి పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. కాలేజీ రోజుల్లో ఆమె చవిచూసిన లవ్‌ ఫెయిల్యూర్‌ కారణంగా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నారని సోషల్‌ మీడియాలో ఓ వార్త అప్పట్లో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా సాయి పల్లవి సినిమాలకు దూరం కానుందనే కథనాలు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఫిదా బ్యూటీ ఫైనల్ గా తనకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా  దృష్టంతా కెరీర్‌ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరమవడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు  ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను’ అని సాయిపల్లవి తేల్చిచెప్పారు. ఇక ఈ కేరళ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో విరాట పర్వం, లవ్‌ స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నారు. 

చదవండి:
ఓ ఇంటివాడైన ‘రంగస్థలం’ మహేశ్‌
పవన్‌ కల్యాణ్‌.. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top