రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | Family Suspense Thriller Movie With Siva Kanthamaneni as Hero | Sakshi
Sakshi News home page

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Aug 22 2019 3:47 PM | Updated on Aug 22 2019 3:47 PM

Family Suspense Thriller Movie With Siva Kanthamaneni as Hero - Sakshi

‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 24న ఆయన మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. శివ కంఠమనేని ప్రధాన పాత్రలో లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 24న రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది.

సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సందర‍్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ శనివారం పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం.

సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. నాలుగు పాటల రికార్డింగ్‌ పూర్తయింది. వీటిలో మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ పాటను ‘గీత గోవిందం’లో ‘కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయింది’ రాసిన సాగర్‌ రాశారు. సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement