ఏడు రోజులు.. ఏడు కోట్లు | Falaknuma Das Movie Success Meet | Sakshi
Sakshi News home page

ఏడు రోజులు.. ఏడు కోట్లు

Jun 9 2019 1:09 AM | Updated on Jun 9 2019 1:09 AM

Falaknuma Das Movie Success Meet - Sakshi

కరాటే రాజు, విశ్వక్‌సేన్, ప్రశాంతి, ఉత్తేజ్‌

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. వాంగ్మయి క్రియేషన్స్‌ పతాకంపై కరాటేరాజు సమర్పణలో విశ్వక్‌సేన్‌ సినిమాస్, టెర్రమర పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 31న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కరాటేరాజు మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్‌వర్క్‌ చేసి, ఎంతో కష్టపడి విశ్వక్‌ సేన్‌ ‘ఫలక్‌నుమా దాస్‌’ చేశాడు.. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది.

మా సినిమా 7 రోజుల్లో 7 కోట్ల 50 లక్షలు వసూలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. సెకండ్‌ ఆఫ్‌ ల్యాగ్‌ ఎక్కువైందని అనడంతో రీ ఎడిటింగ్‌ చేశాం.  భారీ క్యాస్టింగ్‌తో ‘ఫలక్‌నుమా దాస్‌ 2’తో ప్రేక్షకుల ముందుకు వస్తాం’’ అన్నారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ‘ఫలక్‌నుమా దాస్‌’తో ధమ్కీ ఇచ్చా.. నా తర్వాతి సినిమాతో షాక్‌ ఇస్తా’’ అన్నారు. ‘‘శివ, చందమామ’ సినిమాల్లో నా పాత్రలకు ఎంత పేరొచ్చిందో, వాటి తర్వాత ‘ఫలక్‌నుమా దాస్‌’లో చేసిన పాత్రకూ అంతే పేరొచ్చింది’’ అన్నారు నటుడు ఉత్తేజ్‌. సహనిర్మాత: మాణిక్యరావు, హీరోయిన్‌ ప్రశాంతి, నటులు జీవన్, యశ్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement