సైబర్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా అందాల భామ అనుష్కశర్మ కూడా చేరడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
సైబర్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా అందాల భామ అనుష్కశర్మ కూడా చేరడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆకతాయిలు చేసిన అల్లరి పని వల్ల బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్. ఖాన్‌ని అనవసరంగా నిందించి, చటుక్కున నాలిక కరుచున్నారు అనుష్క. వివరాల్లోకెళితే... మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘దట్‌డే ఆఫ్టర్ ఎవ్విరిడే’ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ లఘుచిత్రం విపరీతంగా నచ్చేయడంతో ‘అనురాగ్ ప్రయత్నం చాలా బాగుంది’ అని ట్విట్టర్ ద్వారా అభినందించారు అనుష్క. ఎప్పుడైతే ట్విట్టర్‌లో అనుష్క ఈ మెసేజ్ పోస్ట్ చేశారో... అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకు వేధింపులు మొదలయ్యాయి. 

