సంక్రాంతికి అల్లుళ్లు వస్తున్నారు | F2 - Fun & Frustration First Look Release | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి అల్లుళ్లు వస్తున్నారు

Nov 6 2018 12:19 AM | Updated on Nov 6 2018 12:19 AM

F2 - Fun & Frustration First Look Release - Sakshi

వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్‌ తేజ్‌

సంక్రాంతి పండగంటే కొత్త అల్లుళ్లు ఇంటికి రావడం సంప్రదాయం. సినీ అల్లుళ్లు ‘వెంకటేశ్, వరుణ్‌’ కూడా సంక్రాంతికి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్‌ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు.

చిత్రనిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా సంస్థలో వస్తోన్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కమర్షియల్‌ హంగులతో పర్ఫెక్ట్‌ లాఫ్టర్‌ రైడ్‌లాంటి చిత్రం. మూడు హిట్‌ చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడి చేస్తోన్న చిత్రం. ఇప్పటి వరకూ 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, క్లైమాక్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నాయి. సంక్రాంతికి విడుదలకి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement