మరో టూర్‌కి సిద్ధం | F2 -Fun and Frustration unit to head to Bangkok | Sakshi
Sakshi News home page

మరో టూర్‌కి సిద్ధం

Oct 12 2018 6:04 AM | Updated on Oct 12 2018 6:04 AM

F2 -Fun and Frustration unit to head to Bangkok - Sakshi

వరుణ్‌ తేజ్‌, వెంకటేశ్

ప్రాగ్‌ వెళ్లి వచ్చిన తోడల్లుళ్లు తర్వాత ఎక్కడికి వెళ్లాలో డిసైడ్‌ అయ్యారు. మరి ఈసారి డ్యూయెట్‌ పాడతారో ఏదైనా ముఖ్యమైన సన్నివేశాల కోసమో అన్నది తెలియాల్సి ఉంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఎఫ్‌ 2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈ షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్‌. ఆ తర్వాత లాస్ట్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేశారట. మొత్తం షూటింగ్‌ను నవంబర్‌ నెలలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో వెంకీ, వరుణ్‌ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్‌ అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement