కష్టాలు దాటుకుంటూ వచ్చాం | Eureka Movie Press meet | Sakshi
Sakshi News home page

కష్టాలు దాటుకుంటూ వచ్చాం

Mar 9 2020 5:48 AM | Updated on Mar 9 2020 5:48 AM

Eureka Movie Press meet - Sakshi

కార్తీక్‌ ఆనంద్, సయ్యద్‌ సోహైల్‌ రియాన్

కార్తీక్‌ ఆనంద్, సయ్యద్‌ సోహైల్‌ రియాన్, డింపుల్‌ హయతి, షాలిని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ప్రశాంత్‌ నిర్మించిన ఈ సినిమాకు లలిత కుమారి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలవారు కష్టాలు పడుతున్నారు.  కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు సినిమాల నిర్మాణం, విడుదల వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి’’ అన్నారు. ‘‘ఓ కాలేజ్‌ ఫెస్ట్‌ నేపథ్యంలో సాగే మర్డర్‌ మిస్టరీ ఈ చిత్రం.

ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తూ,  ఓ లీడ్‌ రోల్‌ చేస్తానని కథ చెప్పినప్పుడు ఎక్కువమంది ఒప్పుకోలేదు. కానీ నిర్మాత ప్రశాంత్‌ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు’’అన్నారు కార్తీక్‌ ఆనంద్‌. ‘‘భవిష్యత్‌లో కార్తీక్‌ మంచి స్థాయిలోకి వెళతాడు’’ అన్నారు సయ్యద్‌. ‘‘యువత తలచుకుంటే ఏమైనా సాధించగలరు అన్నదే మా సినిమా’’ అన్నారు ప్రశాంత్‌. ‘‘కొత్తవారు తీసిన సినిమా అని కాకుండా తప్పక చూడండి’’ అన్నారు లలితకుమారి. నటుడు ఆర్కే, సంగీత దర్శకుడు నరేష్, ఎడిటర్‌ అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement